వీడీవీకేలతో మహిళల ఆర్థికాభివృద్ధి
● పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ ● అన్నవరంలో హబ్ భవన ప్రారంభం
చింతపల్లి: గిరిజన ప్రాంతంలో మహిళల ఆర్థికాభివృద్ధికి వన్‌ధన్ (వీడీవీకే) వికాస కేంద్రాలు ఎంతో దోహద పడతాయని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ అన్నారు. సోమవారం మండలంలోని అన్నవరంలో వీడీవీకే హబ్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఐటీడీఏ పరిధిలో 106 వన్‌ధన్ వికాస కేంద్రాలు ఉన్నాయన్నారు. వీటిని ఎనిమిది పీవీటీజీ వర్గాలతో ఏర్పాటుచేశామన్నారు. తమ ఐటీడీఏ పరిధిలోని కొన్ని వన్‌ధన్ వికాస కేంద్రాలను అనుసంధానం చేసి 11 హబ్‌లను ఏర్పాటుచేశామన్నారు. పాడేరులో ముందుగా వన్‌ధన్ వికాస కేంద్రం ఆధ్వర్యంలో అడ్డాకుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించామని, విజయవంతంగా పనిచేస్తుందని పీవో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీవోలు ప్రభాకర్‌రావు,ఎం వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ వి.మురళి, ఏవో హేమలత, వెలుగు ఏపీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment