భూసార పరీక్షలతోమంచి ఫలితాలు
చింతపల్లి: గిరిజన రైతాంగం భూసార పరీక్షల ఆధారంగా సాగుకు అవసరమైన పోషకాలు అందిస్తే మంచి దిగుబడులు పొందవచ్చని స్థానిక ఉద్యానవన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త హెచ్ బిందు అన్నారు. సోమవారం స్థానిక ఉద్యానవన పరిశోధన స్థానంలో ఈ మిర్చా 2.0 ప్రాజెక్టులో భాగంగా హార్టికల్చర్, వ్యవసాయ అసిస్టెంట్లకు పసుపు, మట్టి పరీక్షపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మట్టి నమూనా పరీక్షల ద్వారా పంటకు అవసరమైన పోషకాలు అందించవచ్చన్నారు. భూసారంలో లోపాలు ఉంటే సవరించుకునే అవకాశం ఉంటుందన్నారు. మండల ఉద్యానవన అధికారి కర్ణ మాట్లాడుతూ ఉద్యానవన రైతులు చింతపల్లిలో ఉన్న పసుపు ప్రయోగశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిజటల్ గ్రీన్ ప్రతినిధి శ్రీధర్ మాట్లాడుతూ గిరిజన రైతాంగం పసుపులో మెరుగైన ధరలను పొందేందుకు ఫిబ్రవరిలో కొనుగోలుదారుల తో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి, గూ డెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలకు చెందిన వ్యవసాయ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment