● డీఆర్వో పద్మాలత
పాడేరు : ధ్రువీకరణ పత్రాల ఉపయోగం, పొందే విధానం, వినియోగంపై గిరిజనులకు అవగాహన కల్పించాలని డీఆర్వో పద్మాలత తెలిపారు. ఐటీడీఏ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా న్యాయసేవల సంస్థ ఆధ్వర్యంలో నెలవారీ అవగాహన సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమా వేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా గిరిజనులే ఉండటం, వారిలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండటంవల్ల అవగాహ న క్యాంపులు, సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. కుల,ఆదాయ,జనన, మరణ ధ్రువీ కరణ పత్రాలజారీలో నిర్లక్ష్యం, జాప్యం లేకుండా సేవలు అందించాలన్నారు.ధ్రువీకరణపత్రాల జారీలో ఏ విధమైన కోర్టు కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపా రు. ఈ పత్రాల జారీ విషయంలో పంచాయ తీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లలకు, గ్రా మ రెవెన్యూ అధికారులకు మార్గదర్శకాలతో కూడిన సర్క్యులర్ జారీ చేయాలని జిల్లా పంచాయతీ, డివిజనల్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. డీపీవో లవరాజు, డివిజనల్ పంచాయతీ అధికారి పి.ఎస్.కుమార్, డివిజనల్ అభివృద్ధి అధికారి తేజ్ రతన్, ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ కె.రమేష్ పాల్గొన్నారు.