అరకులోయటౌన్: మండల కేంద్రంలోని పోస్టాఫీస్‌లో ఏర్పాటుచేసిన పాస్‌పోర్ట్ కేంద్రం ద్వారా సేవలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఎమ్మెల్యే మత్స్యలింగం పాస్‌పోర్ట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ గతంలో పాస్‌పోర్ట్ సేవ కేంద్రం లేక స్థానికులు ఎంతో వ్యయ ప్రయాసాలతో సుదూర ప్రాంతాలైన విశాఖపట్నం, అనకాపల్లికి వెళ్లి పాస్‌పోర్ట్ పోందేవారన్నారు. ఇప్పడు అటువంటి సమస్య లేకుండా అరకులోయలో ఈ కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిశీలించి, త్వరితగతిన పాస్‌పోర్టు అందిస్తున్నారన్నారు. అరకులోయ, పాడేరు ఏజేన్సీ ప్రాంత ప్రజలంతా ఈ పాస్‌పోర్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. పాస్‌పోర్ట్ ఇన్‌స్పెక్టర్ కిషోర్, మేనేజర్ నితీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం