చింతూరు: స్థానిక మండల పరిషత్ కో ఆప్షన్ పదవిని వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. కో ఆప్షన్ సభ్యుడిగా మొహమ్మద్ జిక్రియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత కో ఆప్షన్ సభ్యుడు మొహమ్మద్ అక్బర్‌అలీ అనారోగ్యంతో మృతి చెందడంతో కో ఆప్షన్ పదవికి గురువారం ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారి డీఎల్‌డీవో కోటేశ్వరరావు, ఎంపీడీవో రామకృష్ణలు ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించారు. మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలుండగా వైఎస్సార్‌సీపీకి ఎనిమిది మంది, సీపీఎంకు ఇద్దరు, టీడీపీ, ఇండిపెండెంట్‌కు ఒక్కరు చొప్పున సభ్యులున్నారు. కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక ప్రక్రియకు వైఎస్సార్‌సీపీ సభ్యులు మాత్రమే హాజరుకాగా సీపీఎం, టీడీపీ, ఇండిపెండెంట్ సభ్యులు గైర్హాజర య్యారు. వైఎస్సార్‌సీపీ తరపున జిక్రియా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో కో ఆప్షన్ సభ్యుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. సభ్యుడిగా ఎన్నికై న జిక్రియాతో ప్రతిజ్ఞ చేయించడంతో పాటు ఎన్నికై నట్లు ధ్రువీకరణ పత్రం అందచేశారు.
అభినందలు తెలిపిన
ప్రజా ప్రతినిధులు, నాయకులు
కో ఆప్షన్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై న మొహమ్మద్ జిక్రియాను వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు చిచ్చడి మురళి, ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీలు మేడేపల్లి సుధాకర్, యడమ అర్జున్, ఎంపీటీసీలు గౌరమ్మ, నరేష్, నాగరాజు, లక్ష్మి, నాగమణి, సర్పంచ్‌లు సత్తిబాబు, కన్నారావు, చంద్రయ్య, సీత, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రామలింగారెడ్డి, నాయకులు కోట్ల కృష్ణ, మహేష్, విప్లవ్‌కుమార్ పాల్గొన్నారు.