
చింతపల్లి ఆస్పత్రికి పెరిగిన రోగుల తాకిడి
చింతపల్లి: స్థానిక ఏరియాఆస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతోంది. మూడురోజులుగా ఈ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. చింతపల్లి, జీకే వీధి మండలాల్లో గల 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రోగులు వస్తారు. ప్రతి రోజు 250 నుంచి 300 వరకూ సాధారణ ఓపీ ఉంటుంది. బుధవారం వారపు సంత రోజున నాలుగు వందల వరకూ ఓపీ ఉంటుంది. ఎండలు మండిపోతుండడంతో ఆరో గ్య సమస్యలు అధికమవుతున్నాయి. దీంతో అన్ని ప్రాంతాల నుంచి ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జనరల్ వ్యాధులతో పాటు మలేరియా,టైఫాయిడ్ వంటి జ్వరాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికి ఆస్పత్రిలో 11 మలేరియా,17 టైఫాయిడ్ కేసులు నమోదైనట్టు సూపరింటెండెంట్ ఇందిరా ప్రియాంక తెలిపారు.