
సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల ధర్నా
సాక్షి,పాడేరు: ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపు మేరకు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద బుధవారం ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు ధర్నా చేశారు. 12వ పీఆర్‌సీని ఏర్పాటు చేయాలని, పీఆర్‌సీ కమిషన్ ఆలస్యమైతే వెంటనే ఐఆర్ ప్రకటించాలని, కారుణ్య నియామకాలు జరపాలని,పెండింగ్ బకాయిలు, 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్స్ మంజూరు చేయాలని, పాత పింఛన్ విధానాన్ని అమలుచేయాలని,70ఏళ్లు పైబడిన రిటైర్డ్ ఉపాధ్యాయులకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించాలని, ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు 11వ పీఆర్‌సీ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.అనంతరం కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్‌ను కలిసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.