
సారా తయారీ కేంద్రాలపై దాడులు
ఎటపాక: రాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఎటపాక మండలంలో నాటుసారా తయారీ కేంద్రాలపై రెండు తెలుగు రాష్ట్రాల ఎకై ్సజ్, పోలీసు శాఖల అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. గురువారం పిచుకలపాడు, గుండువారిగూడెం గ్రామాల్లో ఎకై ్సజ్, సివిల్ పోలీసులు జరిపిన దాడుల్లో సారా తయారీకి వినియోగించే 6,800 లీటర్ల బెల్లం ఊటను, 60 లీటర్ల నాటు సారా, 10 కేజీల అమ్మోనియా, 120 కేజీల నల్లబెల్లంను సీజ్ చేశారు. పిచుకలపాడులో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. సారా తయారీకి ఉపయోగించే 46 డ్రమ్ములను ధ్వంసం చేసినట్లు రంపచోడవరం అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరిండెంట్ నాగరాహుల్ తెలిపారు. ఈ దాడుల్లో కొత్తగూడెం ఏఈఎస్ కరంచంద్, రంపచోడవరం ఏఈఎస్‌టీఎఫ్ సీఐ ఇంద్రజిత్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శ్రీనివాస్, చింతూరు ఎకై ్సజ్ ఎస్‌ఐ స్వామి, భద్రాచలం ఎస్‌హెచ్‌వో రహీమునిషా, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రమేష్, ముణుగూరు సీఐ కిషోర్‌బాబు, పాల్వంచ సీఐ సరిత, ఎటపాక సీఐ కన్నపరాజు తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న రెండు రాష్ట్రాల అధికారులు
6,800 లీటర్ల పులిసిన
బెల్లపు ఊట ధ్వంసం
60 లీటర్ల నాటుసారా స్వాధీనం
10 కేజీల అమ్మోనియా,
120 కేజీల నల్ల బెల్లం సీజ్
పిచ్చికలపాడులో ఇద్దరిపై కేసులు నమోదు