
జాతీయస్థాయి పోటీలకు గిరిజన బాలికలు
జి.మాడుగుల: థాగంట మార్షల్ ఆర్ట్స్‌లో జాతీయ స్థాయి పోటీలకు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి గిరిజన బాలికలు ఎంపికై నట్టు సుమన్ షూడోకాన్ రుద్రమాదేవి, సెల్ఫ్ డిపెన్స్ అకాడమీ జిల్లా కో–ఆర్డినేటర్ సాగేని రాజేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జి.మాడుగుల మండల జి.ఎం.కొత్తూరు గ్రామంలోని కేజీబీవీ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సోముల రమ్య ఢిల్లీకి, దుక్కేరి ప్రమీలరాణి మణిపూర్‌లో జరగనున్న జాతీయ స్థాయి థాంగుట పోటీల్లో పాల్గొననున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న గిరిజన బాలికలను, కోచ్ జి.మాడుగుల పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ షణ్ముఖరావు, హౌసింగ్ ఏఈ దూరు ఈశ్వరరావు నగదు ప్రోత్సాహం అందించారు. కళాశాల యాజమాన్యం, పీఈటీ గంగాభవానీ, జిల్లా కో–ఆర్డినేటర్ రాజేశ్వరరావు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న బాలికలను ఎంఆర్వో సిబ్బంది, కళాశాల సిబ్బంది తదితరులు అభినందించారు.