
మోదకొండమ్మతల్లి ఉత్సవాలకు శ్రీకారం
సాక్షి, పాడేరు: వచ్చే నెల 11, 12, 13 తేదీల్లో ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మతల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవాలకు సంబంధించి అన్ని వర్గాల భక్తుల సహకారం తీసుకుంటున్నామన్నారు. పందిరి రాట ప్రతిష్ట కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించి, ఉత్సవ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ, వైస్ ఎంపీపీ గంగపూజారి శివ, కేంద్ర కాఫీ బోర్డు డైరెక్టర్ కురుసా ఉమామహేశ్వరరావు, మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర, ఉప సర్పంచ్ బూరెడ్డి రామునాయుడు, మోదకొండమ్మతల్లి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు పలాసి కృష్ణారావు, కిల్లు గంగన్నపడాల్, కొట్టగుళ్లి సుబ్బారావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.