దిగజారిన ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

దిగజారిన ఉత్తీర్ణత

Published Sun, Apr 13 2025 2:13 AM | Last Updated on Sun, Apr 13 2025 2:13 AM

దిగజా

దిగజారిన ఉత్తీర్ణత

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు డీలాపడ్డారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో గత ఏడాదితో పొల్చితే ఫలితాలు పడిపోయాయి. ఈ ఏడాది ఫస్టియర్‌లో 46 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 63 ఉత్తీర్ణత నమోదైంది. నిరుడు ఫస్టియర్‌లో 48 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 70శాతం ఉత్తీర్ణత నమోదైంది.

సాక్షి,పాడేరు: ఇంటర్‌ పరీక్షల ఫలితాలలో జిల్లా తిరోగమనం వైపు పయనించింది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత తగ్గింది. గత ఏడాది ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 48శాతం సాధించగా, ఈఏడాది 46శాతం మంది ఉత్తీర్ణలయ్యారు. గత ఏడాది కంటే 2శాతం తగ్గింది. ద్వితీయ సంవత్సరంలో గత ఏడాది 70శాతం సాధించగా, ఈసారి 63శాతం మాత్రమే వచ్చింది. ఏడు శాతం తగ్గింది. రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ సంవత్సరంలో 14వ స్థానం, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 23స్థానాలకు పరిమితమైంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి సంబంధించి జనరల్‌,ఒకేషనల్‌ గ్రూప్‌ల్లో 4,988 మంది పరీక్షలు రాయగా, 3,681మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 5,662 మందికి గాను 4,409మంది ఉత్తీర్ణులయ్యారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో...

జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ఉత్తీర్ణత గత ఏడాది కంటే తగ్గింది.ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 3,093 మందికి గాను 1,553 మంది ఉత్తీర్ణులయ్యారు. ముంచంగిపుట్టు జూనియర్‌ కళాశాలలో అత్యధికంగా 87శాతం మంది పాస్‌ అయ్యారు. ఇక్కడ 239 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 198 మంది ఉత్తీర్ణలయ్యారు. అత్యల్పంగా వి.ఆర్‌.పురంలో ఆరుశాతం మంది ఉత్తీర్ణలయ్యారు. ఇక్కడ 49 మంది పరీక్షలు రాయగా ముగ్గురు మాత్రమే పాస్‌ అయ్యారు. అడ్డతీగల కళాశాలలో 8 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.ఇక్కడ 142మంది పరీక్షలు రాయగా 11మంది మాత్రమే పాస్‌ అయ్యారు. గంగవరం కళాశాలలో 47మంది పరీక్షలు రాయగా, ఐదుగురు ఉత్తీర్ణులవడంతో 11శాతం ఫలితాలు వచ్చాయి. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 2,883 మంది పరీక్షలు రాయగా,1,956 మంది పాస్‌ అయ్యారు. జిల్లాలో అత్యధికంగా ముంచంగిపుట్టు జూనియర్‌ కళాశాల 95 శాతం ఉత్తీర్ణత సాధించింది. 222 మందికిగాను 210 మంది ఉత్తీర్ణులయ్యారు. అత్యల్పంగా జి.మాడుగుల జూనియర్‌ కళాశాలలో 280 మందికి గాను 105 మంది పాస్‌ అవ్వడంతో 38శాతం ఉత్తీర్ణత లభించింది.

గురుకుల విద్యాలయాల్లో ...

జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఫలితాలు కాస్త మెరుగుపడ్డాయి. 17 గురుకులాలకు సంబంధించి 2,220 మంది గిరిజన విద్యార్థులు ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయగా, 1,689మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 530 మంది ఫెయిలయ్యారు.సెకండ్‌ ఇయర్‌కు సంబంధించి 2,224 మంది పరీక్షలు రాయగా, 1,984మంది ఉత్తీర్ణులయ్యారు. 236 మంది ఫెయిలయ్యారు. అడ్డతీగల హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఇద్దరు పరీక్షలు రాయగా, ఇద్దరు పాస్‌ అయ్యి 100శాతం ఫలితాలు సాధించారు.

ఐదు కేజీబీవీల్లో

100 శాతం ఫలితాలు

జిల్లాలో ఐదు కేజీబీవీలు వంద శాతం ఫలితాలు సాధించాయి. జిల్లాలోని 19 కస్తుర్బాంధీ విద్యాలయాలకు సంబంధించి 675 మంది బాలికలు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయగా, 439మంది పాస్‌ అయ్యి 65శాతం ఫలితాలు సాధించారు. వీరిలో 236 మంది ఫెయిలయ్యారు. అత్యధికంగా ముంచంగిపుట్టు(కిలగాడ)కేజీబీవీ 97శాతం ఫలితాలు సాధించింది.14శాతం ఫలితాలతో అరకులోయ కేజీబీవీ విద్యార్థులు అట్టడుగున నిలిచారు. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌కు సంబంధించి 565 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా,469మంది ఉత్తీర్ణులై 83శాతం ఫలితాలు సాధించారు. 96మంది ఫెయిలయ్యారు. డుంబ్రిగుడ, జీకే వీధి,హుకుంపేట,కొయ్యూరు,ముంచంగిపుట్టు(కిలగాడ)విద్యాలయాలు 100శాతం ఫలితాలతో సత్తా చాటాయి. 25శాతం ఫలితాలతో అరకులోయ కేజీబీవీ అట్టడుగు స్థానంలో నిలిచింది.

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 46శాతం,

సెకండ్‌ ఇయర్‌లో 63 శాతం పాస్‌

జిల్లాకు ప్రథమ సంవత్సరంలో 14,

ద్వితీయ సంవత్సరంలో 23వ స్థానం

దిగజారిన ఉత్తీర్ణత1
1/4

దిగజారిన ఉత్తీర్ణత

దిగజారిన ఉత్తీర్ణత2
2/4

దిగజారిన ఉత్తీర్ణత

దిగజారిన ఉత్తీర్ణత3
3/4

దిగజారిన ఉత్తీర్ణత

దిగజారిన ఉత్తీర్ణత4
4/4

దిగజారిన ఉత్తీర్ణత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement