
ఆదివారం మిట్ట మధ్యాహ్నం 12:30 గంటల సమయం..ఒకవైపు మండుతున
11 మంది పనిచేస్తున్నారు...
ప్రతిరోజూ అక్కడ 20 నుంచి 30 మంది వరకు కార్మికులు పనిచేస్తారు. బాణసంచా కేంద్రంలో ప్రమాద ఘటన జరిగే సమయానికి 16 మంది మాత్రం ఉన్నారు. లేదంటే అపార ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. వచ్చే మంగళవారం కోటవురట్ల మండలంలో అన్నవరం, చౌడువాడ, పందూరు గ్రామాల్లో గ్రామ జాతర ఉత్సవాలు ఉండడంతో బాణసంచా ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయి. దీంతో గత వారం రోజులుగా పని ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఆదివారం కావడంతో అక్కడ పనిచేసే సామర్లకోటకు చెందిన ఒక కుటుంబం సంతకు వెళ్లేందుకు ఓనర్ నుంచి డబ్బులు తీసుకోవడానికి మాత్రమే వచ్చారు. దీంతో అక్కడ పనిచేసే 11 మందితో పాటు ఈ అయిదుగురూ ప్రమాదంలో గాయపడ్డారు.