
కాశీపురం రైతు బిడ్డ పరదేశినాయుడుకు డాక్టరేట్
దేవరాపల్లి: మండలంలోని కాశీపురం రైతు కుటుంబానికి చెందిన ఆదిరెడ్డి పరదేశినాయుడు శుక్రవారం చైన్నెలోని భారత్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ను తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి గోవి చెజియాన్ చేతుల మీదుగా అందుకున్నారు. పరదేశినాయుడు గత 18 ఏళ్లుగా అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మైక్రో బయాలజీ అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. డెంగ్యూ వైరస్‌పై జరిపిన పరిశోధనలకు డాక్టరేట్‌ను ఆయన అందుకున్నారు. పరదేశినాయుడు పీహెచ్‌డీ పట్టా అందుకోవడంపై స్థానిక ప్రజలు, పెద్దలు, యువకులు హర్షం వ్యక్తం చేశారు.