●సింహ వాహనంపై దర్శనమిచ్చిన ఖాద్రీశుడు
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి నాల్గవ రోజైన బుధవారం సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సింహం శౌర్యానికి, గాంభీర్యానికి, పరాక్రమానికి ప్రతీక. స్వామివారికి ప్రీతి పాత్రమైన ఈ సింహ రూపంలోనే నర–సింహ అవతారమెత్తి హిరణ్య కశిపుడిని సంహరించారు. స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతుంటే ఎప్పటి లాగానే తమిళనాడుకు చెందిన నాదస్వరం, డోలు విద్వాంసులు శ్రీవారి వాహనం ముందు భక్తితో పాటు తమ కళను చాటుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం లక్ష్మీ నారసింహుడు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
●సింహ వాహనంపై దర్శనమిచ్చిన ఖాద్రీశుడు
Comments
Please login to add a commentAdd a comment