
వైఎస్సార్ కడప: అఫ్గానిస్తాన్ నుంచి కమాండో హజీవలి గురువారం ఢిల్లీకి చేరాడు. ఈ విషయాన్ని కొండాపురంలో ఉన్న ఆయన బంధువులు తెలియజేశారు. వారు చెప్పిన వివరాల ప్రకారం కొండాపురానికి చెందిన హజీవలి 13 ఏళ్ల కిందట ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు (ఐటీబీపీ)లో కమాండోగా పనిచేస్తున్నారు.రెండేళ్ల కిందట కాందహార్‌లో భారత రాయబార కార్యాలయంలోని భద్రతా విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు.
ప్రస్తుతం అఫ్గాన్‌లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారడంతో అక్కడ ఉన్న సైనికులను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు.వీరిలో వైఎస్సార్ జిల్లా కొండాపురానికి చెందిన హజీవలి కూడా ఉన్నారు. అఫ్గాన్‌లోని రాయబార కార్యాలయం నుంచి విమానాశ్రయానికి వెళ్లడానికి రాత్రి సమయంలో గంటపాటు ప్రయాణించినట్లు తాలిబన్ల కంటపడకుండా ఐటీబిపీ సిబ్బంది ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు హజీవలి తెలిపారని బంధువులు వివరించారు.
చదవండి:Jasprit Bumrah Wife Sanjana Ganesan: అదిరిపోయే ఫోటోను షేర్ చేసిన బుమ్రా