శనివారం ఎస్వీ ఆర్ట్స్ కళాశాల వద్ద భిక్షమెత్తుకుంటున్న ప్రసాద్,ఈనాడు ప్రచురించిన భిక్షగాడి ఫొటో
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ప్రసాద్. ఈయన తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల సమీపంలో పదేళ్లుగా యాచిస్తూ బతుకుతున్నాడు. నగరంలో శుక్రవారం అమరావతి రైతుల మహాసభ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు ఆయనకు రూ.200 ఇచ్చి ఒళ్లంతా ‘జై అమరావతి’ అంటూ పెయింట్లతో రాయించి సభకు తరలించారు. ఈయన ఫొటోను ఈనాడు దినపత్రిక అమరావతి రైతు అని అనిపించేలా ప్రముఖంగా అచ్చేసేసింది. సీన్ కట్‌చేస్తే.. శనివారం ఎస్వీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఫుట్‌పాత్‌పై ఎప్పటిలాగే అతను యాచిస్తూ అటుగా వెళ్లే వారందరికీ ఒళ్లంతా పెయింట్లతో కనిపించాడు.
ఆయన్ను ‘సాక్షి’ గుర్తుపట్టి పలుకరించగా.. ‘టీడీపీ నాయకులు నాకు రూ.200 ఇచ్చి వేషం వేసి సభకు తీసుకెళ్లారు. సభ అయిపోగానే వదలివెళ్లిపోయారు’.. అని విషయం బయటపెట్టాడు. తనకు ఇతర విషయాలేవీ తెలియవని, పదేళ్లుగా ఇక్కడే భిక్షాటన చేస్తున్నానని చెప్పాడు. ఈనాడులో శనివారం వచ్చిన ఈ వ్యక్తి శనివారం భిక్షాటన చేస్తూ కనిపించడంతో ప్రజలు ఔరా.. అతను ఇతనూ ఒక్కరే కదా అంటూ పచ్చ మీడియా తాపత్రయాన్ని చూసి నవ్వుకున్నారు. అందుకే.. అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలి అంటారు పెద్దలు.
– ఫొటో: మహమ్మద్ రఫి/సాక్షి, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment