
సాక్షి, అమరావతి: తమిళనాడు రాష్ట్రానికి ఈ నెల 25 నుంచి బస్సు సర్వీసులు పునరుద్ధరించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సంసిద్ధమయ్యింది. కోవిడ్ కారణంగా మార్చి 21 నుంచి బస్సు సర్వీసులను ఆపేసిన విషయం విదితమే. ఏపీ నుంచి చెన్నైకి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని ఇటీవల ఏపీ ప్రభుత్వం కోరడంతో తమిళనాడు ప్రభుత్వం అంగీకరించింది.
లాక్‌డౌన్ ప్రారంభానికి ముందు చెన్నైకి ప్రతిరోజూ ఏపీ నుంచి 273 సర్వీసులు తిరిగేవి. ఇప్పుడు వీటిని దశల వారీగా తిప్పేందుకు ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. తిరుమల, తిరుపతి నుంచి సర్వీసులు ఎక్కువగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.