సాక్షి,అనకాపల్లి: సంపద సృష్టి పేరుతో చంద్రబాబు మోసం చేశారని, ఆయనలా మోసం చేయడం వైఎస్ జగన్కు తెలియదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ అన్నారు. అనకాపల్లి, భీమిలి నియోజకవర్గ నేతలతో బొత్స సత్యనారాయణ సమావేశమై కీలక వ్యాఖ్యలు చేశారు.
‘మెజారిటీ ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తున్నాం. రెండు పార్టీలు మధ్య 400 ఓట్లు తేడా ఉంది. ప్రలోభాలతో గెలవాలని చూస్తున్నారు.. చంద్రబాబు మోసం ప్రజలకు తెలియాలి. గతంలో టీడీపీ కంటే 50 ఓట్లు తక్కువగా ఉంటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
కానీ టీడీపీ అలా కాదు. సంఖ్యా బలం లేదని తెలిసినా, వైఎస్సార్సీపీకి 380 ఓట్లు పైచిలుకు ఆధిక్యత ఉందని తెలిసినా పోటీకి దిగుతుందన్నారు. చంద్రబాబు డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం..
ఈ సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు పార్టీ అండగా ఉంటుందని బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించారు. మీ గౌరవాన్ని పార్టీ కాపాడుతుంది.. చంద్రబాబు చెప్పిన హామీలను ఎన్నడూ అమలు చేయరు.. జగన్ మాట ఇస్తే అమలు చేస్తారు.. ఇచ్చిన మాట తప్పడానికి జగన్ ఒప్పుకోరు. సంపదను సృష్టిస్థామని ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు. డబ్బులు లేవన్న సంగతి ఎన్నికలకు ముందు తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబులా మాయ, మోసం, దగా చేయడం వైఎస్ జగన్కు తెలియదు అని వ్యాఖ్యానించారు.
టీడీపీ మోసాల్ని నమ్మొద్దు
ఏజెన్సీ ప్రాంతం నుంచి 114 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వైఎస్ జగన్ దగ్గరికి వెళ్లారు. కానీ టీడీపీ మాత్రం వైఎస్సార్సీపీ చెందిన 60 మంది తమ దగ్గర ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారి మాటల్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ పోదాం అని బొత్స సత్యనారాయణ అనకాపల్లి నియోజకవర్గ నేతలతో జరిపిన సమావేశంలో పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment