
సాక్షి, విజయవాడ: తన లీగల్ టీమ్‌ను కలిసేందుకు అనుమతి కోరుతూ సిట్ అధికారులకు చంద్రబాబు లేఖ రాశారు. లాయర్లు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు, ఎం.లక్ష్మీనారాయణ, జవ్వాజి శరత్ చంద్రలను కలిసేందుకు చంద్రబాబు అనుమతి కోరారు.
కాసేపట్లో ఏపీ సీఐడీ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది. అంతకు ముందు ఆయన్ని సీఐడీ ఆఫీసుకు తరలించారు.. ఆయనకు వైద్య పరీక్షలు అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి చంద్రబాబును నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment