
సాక్షి, గుంటూరు: గిట్టుబాటు ధర లేక రైతులు పీకల లోతు కష్టాల్లో ఉంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ మిర్చి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించే ఇంటవెర్షన్ ధర వల్ల రైతులకు ఎలా గిట్టుబాటు అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తేజ, డీలక్స్ లాంటి రకాలు 12000 నుంచి 12,500 వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం 11 871 కొనుగోలు చేస్తే తమకు ఎలా లాభమో ప్రభుత్వమే చెప్పాలంటూ రైతులు నిలదీశారు.
‘‘చంద్రబాబు ఏసీ గదిలో కూర్చుని మిర్చి వ్యాపారులు, బ్రోకర్లతో మీటింగ్ పెడితే ఏంటి లాభం?. మిర్చి యార్డ్‌కి వచ్చి మా పరిస్థితి, బాధలు చంద్రబాబు వింటే అర్థమవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన రేటు వల్ల మిర్చి రైతు మరింత కష్టాల్లో పడతాడు. క్వింటా మిర్చి 19000 నుంచి 20,000తో ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మిర్చి వెంట గిట్టుబాటు ధర రూ.20,000గా ప్రకటించాలి’’ అని మిర్చి రైతులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం 20 వేలు రేటు ప్రకటించకపోతే ఎంత మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకుంటారో తెలియదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఎందుకు మిర్చి ఎక్స్పోర్ట్ చేయట్లేదు. ప్రభుత్వం చేతకానితనం వల్లే మిర్చి పండించిన ప్రతి రైతు ఇవాళ అప్పుల్లో కూరుకుపోయాడు’’ అని రైతులు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment