మంగళగిరిలో చౌక దుకాణాలను తనిఖీ చేస్తున్న అరుణ్‌కుమార్
సాక్షి, అమరావతి: రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం వహించొద్దని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన మంగళగిరిలో చౌక దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎంజీకేఏవై కింద ఉచిత బియ్యం పంపిణీని పరిశీలించారు. ప్రతి దుకాణం వద్ద తప్పనిసరిగా ఉచిత బియ్యం లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాలని ఆదేశించారు.
సమీపంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎండీయూ వాహన సేవలు, బియ్యం నాణ్యతపై అభిప్రాయాణలను సేకరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. నాణ్యమైన (సార్టెక్స్) బియ్యాన్ని వాహనాల్లో ఇంటి వద్దకే అందించడం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో రేషన్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. చాలా మంది పేదలు ప్రభుత్వం ఇస్తున్న రూపాయికే కిలో బియ్యంతో కడుపు నింపుకుంటున్నట్టు చెప్పారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment