
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలోని ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో 341 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(సీఏఎస్‌ఎస్) పోస్టుల భర్తీకి ఆ విభాగం పరిమిత నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. https://dmeaponline.com/లో ఆన్‌లైన్ అప్లికేషన్‌లను శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 26 రాత్రి 11:59 గంటల వరకు గడువు ఉంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నాటికి గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్–సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు మినహాయింపు ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు సమయంలో రూ.500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, ఎక్స్–సర్వీస్‌మెన్‌లు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎంపిక విధానం, జీతభత్యాలు, ఇతర వివరాలు https://hmfw.ap.gov.inలో అందుబాటులో ఉంచారు. ఈ ఖాళీలు తాత్కాలికమైనవని, అవసరాలకు అనుగుణంగా ఖాళీల సంఖ్య తగ్గడం, పెరగడం ఉంటుందని ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు.