సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలు శిక్ష విధించింది. వీరికి రెండు వారాల పాటు కోర్టు జైలు శిక్షను విధించింది. అయితే, జైలు శిక్ష విధించిన నేపథ్యంలో సదరు ఐఏఎస్‌లు ధర్మాసనాన్ని క్షమాపణలు కోరారు. దీంతో కోర్టు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది.
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పాటు ప్రతీ నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని కోర్టు పేర్కొంది. అలాగే, ఒకరోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఎనిమిది మంది ఐఏఎస్‌లను హైకోర్టు ఆదేశించింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పై తీర్పును వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment