సాక్షి, తాడేపల్లి: ఫోన్ ట్యాపింగ్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారని అందుకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కూర్చొని చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి, చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారని మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నాయుడు దివాళా తీసిన టీడీపీకి అధ్యక్షులు. హైదరాబాద్‌లో కూర్చొని ప్రధానమంత్రి, చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. ఆధారాలు చూపించమంటే చంద్రబాబు చూపించలేక పోయారు.. గాలి వార్తలు రాసే కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ప్రధానికి ఎలా లేఖ రాస్తారు? చరిత్రలో ఎన్నడూలేని విధంగా సీఎం జగన్ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే చంద్రబాబు దానిని అడ్డుకున్నారు. (జీవీఎల్‌పై అనుచిత వ్యాఖ్యలు, కేసు నమోదు)
అంతర్జాతీయ అవినీతి సంఘానికి చంద్రబాబు అధ్యక్షుడు. 30 లక్షల మంది మహిళల జీవితాల్లో చంద్రబాబు నిప్పులు పోశారు. కోర్ట్‌కు వెళ్లి శిఖండిలా చంద్రబాబు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసే కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నారు. త్వరలోనే 30 లక్షల మహిళలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. చంద్రబాబు నరకాసురుడులా అడ్డుపడిన ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాం. స్కాం బాబు అంటే చంద్రబాబు, సూటికేస్ బాబు అంటే చినబాబు. అవినీతికి పేటెంట్ చంద్రబాబు నాయుడు. అవినీతి పరుడైన చంద్రబాబుకు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ప్రభుత్వం సుమారు రూ. 60 వేల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసింది. కరోనా సమయంలో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ వదిలి రాకుండా అక్కడి నుంచే జూమ్‌లో మీటింగ్‌లు పెడుతున్నారు. లోకజ్ఞానం లేని లోకేష్ వలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేస్తున్నారు. అ, ఆ.. లు రాని లోకేష్‌ను చంద్రబాబు మంత్రిగా చేశారు. లోకేష్ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరు. లోకేష్ మీద ఒక వలంటరీని పోటీకి పెట్టి గెలిపిస్తాం, మా సవాల్‌కు చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని జోగి రమేష్ డిమాండ్ చేశారు.
‘లోకేష్ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరు’
Published Fri, Aug 21 2020 6:46 PM | Last Updated on Fri, Aug 21 2020 7:10 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment