
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం కోర్టు ఇవాళ(సోమవారం) ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారని దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది.
సుప్రీం కోర్టులో వివేకా హత్య కేసు నిందితుడి భార్య ఒక పిటిషన్ దాఖలు చేసింది. శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను మార్చాలని తులసమ్మ పిటిషన్‌లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే.. దర్యాప్తు అధికారి బాగానే పని చేస్తున్నారంటూ కోర్టుకు సీబీఐ బదులిచ్చింది.
ఈ క్రమంలో దర్యాప్తు ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. మరో అధికారిని ఎందుకు నియమించకూడదని ప్రశ్నిస్తూనే, కేసు విచారణ పురోగతిపై సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తూ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment