కొల్లేరును నాశనం చేయాలని చూస్తున్నారా?
టీడీపీ నాయకుడిగా నాకు అడిగే హక్కు ఉంది
ఏలూరు రూరల్: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఉన్నారా లేదా అన్నది స్పష్టంచేయాలని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం శ్రీపర్రు గ్రామ టీడీపీ నేత సైదు గోవర్థన్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
ఇందులో.. పవన్‌కళ్యాణ్ కొల్లేరును సర్వనాశనం చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నిస్తూ.. దీనికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుడిగా తనకు ఇలా అడిగే హక్కుందన్నారు. ఇటీవల జనసేన నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి కొల్లేరు గ్రామాల్లోని వైఎస్సార్‌సీపీ నాయకులను వారి పార్టీలోకి ఆహ్వానించారని చెబుతూ.. దొంగలను పార్టీలోకి ఆహ్వానిస్తుంటే ఎక్కడ దాక్కున్నారని అసభ్య పదజాలంతో దూషించారు.
జనసేన నాయకుల కారణంగా కొల్లేరు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారి పనితీరును అడ్డుకుంటానని గోవర్థన్ హెచ్చరించారు. ఈ వీడియో కొల్లేరు గ్రామాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. జనసేన నేతల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టేందుకు కొందరు టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment