
సాక్షి, విజయవాడ: ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి కొన్ని గంటలు కూడా కాలేదు. అప్పుడే టీడీపీ నేతల దుశ్చర్యలు మొదలయ్యాయి. తాజాగా వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌పై దాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో ఆయన టిఫిన్ చేస్తుండగా టీడీపీ అనుకూల వర్గీయుల దాడి చేశారు.
నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి నీకుందా..? అంటూ రెచ్చిపోయారు. అక్కడే ఉన్న ఫోర్క్‌తో పొడిచే ప్రయత్నం చేశారు. అదే సమయంలో హోటల్ సిబ్బంది అడ్డుకోవడంతో నాగార్జునకు ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. నాగార్జున యాదవ్‌పై అసభ్య పదజాతంతో టీడీపీ శ్రేణులు దూషణలకు దిగాయి. చంపుతామంటూ నాగార్జున యాదవ్‌కు వారు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment