
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆఖరికి చేతులెత్తేశారు. రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుంది. సంఖ్యాబలం లేక ఆ పార్టీ చతికిలబడింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓటు వేయరనే భయంతో చివరి నిమిషంలో బాబు వెనక్కి తగ్గారు. ఓటుకు కోట్లు వెచ్చిస్తే తెలంగాణ చేదు అనుభవం తప్పదని బాబు భయపడిపోయారు.
బలం లేకపోయినా ఎమ్మెల్యే కొనుగోలుకు చంద్రబాబు యత్నించినా.. ఆయన కుట్రలు, కుతంత్రాలు ఫలించలేదు. కాగా పార్టీ స్థాపించినప్పటి నుంచి తాజాగా తొలిసారి రాజ్యసభలో టీడీపీ ఉనికి కోల్పోనుంది. ఫలితంగా.. 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభ స్థానం గల్లంతు కాబోతోంది.
చదవండి: వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా గెలిపించుకుందాం: బాలినేని