
సాక్షి, కాకినాడ: జిల్లాలో వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీలో మరోసారి పేలుడు సంభవించింది. సోమవారం కార్మికులు పనులు చేస్తుండగా.. వాక్యామ్ గడ్డర్ పడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మృతులను సుబ్రహ్మణ్యం, రాం ప్రసాద్‌గా గుర్తించారు. కాగా, వారి మృతితో పరిశ్రమ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు.
ఇక, ప్యారీ కంపెనీలో 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రమాదం చోటుచేసుకోవడం కార్మికులను భయాందోళనకు గురిచేసంది. ఇదే పరిశ్రమలో ఆగస్టు 12వ తేదీన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. కాగా, రిఫైనరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కన్వేయర్ బెల్ట్ పేలడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment