సాక్షి, అమరావతి: అలనాటి రామాయణంలో.. యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు రాకాసిమూకలు మేఘాల్లో దాగినట్లుగా ఈనాటి రాక్షసులు ఫిలింసిటీ కొండల్లో నక్కి సంక్షేమ యజ్ఞంపై రోజుకో కుట్ర పన్నుతున్నారు! అందులో తాజా అంకమే ‘ఈనాడు – ఆటవిక రాజ్యం’!! పల్నాడులో ఏ గడపను పలుకరించినా వివక్షకు దూరంగా సాగుతున్న సంక్షేమ పాలన, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేకూర్చిన అభివృద్ధి ఫలాల గురించి చెబుతుంది. నాలుగేళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పల్నాడు అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రత్యేక జిల్లా ఏర్పాటుతోపాటు కొత్త మెడికల్ కాలేజీ, వరికపుడిసెల, జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణంతో ప్రగతి రథం పరుగులు తీస్తోంది.
మాచర్లలో 90 శాతం కుటుంబాలకు లబ్ధి
పల్నాడు పట్టుగొమ్మ మాచర్ల నియోజకవర్గంలో ఇప్పుడు 3,66,269 మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రయోజనం పొందుతున్నారు. నాలుగేళ్లలో డీబీటీతో నేరుగా రూ.1,209.56 కోట్లు లబ్ధి పొందారు. నియోజకవర్గంలో 1,07,793 కుటుంబాలు ఉండగా 97,136 కుటుంబాలకు డీబీటీ పథకాలు అందుతున్నాయి. 90.11 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు చేరుతున్నట్లు గణాంకాలే వెల్లడిస్తున్నాయి.
నియోజకవర్గంలో మొత్తం 3,05,078 జనాభా ఉండగా 1,59,017 మంది డీబీటీ పథకాల వల్ల లబ్ధి పొందుతున్నారు. ఇక నాన్ డీబీటీతో 1,13,443 మంది ప్రయోజనం పొందారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే డీబీటీ పథకాల ద్వారా ఇప్పటివరకు రూ.2,21,168.55 కోట్లను ప్రభుత్వం నేరుగా అందించడం గమనార్హం. రాష్ట్రంలో 1,66,05,771 కుటుంబాలు ఉండగా 1,47,37,989 కుటుంబాలకు డీబీటీ పథకాల ద్వారా ప్రయోజనం దక్కుతోంది. 88 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందడం దేశంలోనే రికార్డు.
ఫ్యాక్షన్ ‘బాబు’.. కోడెల కోటలో బాంబులు!
చంద్రబాబు పేరెత్తితేనే పల్నాట పాత గాయాలు రేగుతాయి. 1999 ఎన్నికల సమయంలో నరసరావుపేటలో కోడెల శివప్రసాదరావు ఇంట్లో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన బాంబులు పేలడంతో నలుగురు మృతి చెందిన విషయం ఎవరూ మరచిపోలేరు! 2001 మార్చి 9న దుర్గి మండలం ఆత్మకూరు బోడు వద్ద కాంగ్రెస్ వర్గీయులపై బాంబులు, వేట కొడవళ్లతో దాడిచేసి ఏడుగురిని ఒకేసారి నరికి చంపారు. 2014 నుంచి 2019 వరకు పల్నాడులో ముఠా కక్షలు జడలు విప్పాయి.
2014 – 2019 పల్నాడులో టీడీపీ మారణహోమం ఇలా..
- 2014 సెపె్టంబర్ 22వతేదీన వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం మేళ్లవాగులో వైఎస్సార్ సీపీ నేతలు పెద నాగిరెడ్డి, చిన నాగిరెడ్డి టీడీపీ నాయకుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. జంట హత్యలతో చితికిపోయిన ఆయా కుటుంబాలు గ్రామం వదిలి వేరే చోట తలదాచుకున్నాయి.
- టీడీపీ అధికారంలో ఉండగా నీలగంగవరం గ్రామంలో రావులపల్లి పెదమునయ్యపై టీడీపీ వర్గీయులు దాడి చేసి గాయపరచడంతో మృతి చెందాడు.
- 2014 సెపె్టంబర్ 11న కారంపూడి మండలం చినగార్లపాడులో వైఎస్సార్‌సీపీ నాయకుడు వేంపాటి గోవిందరెడ్డి(45) ఇంటిపై దాడి చేసి వెంటాడి చంపారు. అడ్డు వచ్చిన భార్య కోటేశ్వరమ్మను, చింతలచెర్వు కోటిరెడ్డిని సైతం హతమార్చేందుకు ప్రయతి్నంచారు.
- 2014 డిసెంబర్ 19న కోర్టు వాయిదాకు హాజరై తిరిగి వెళ్తున్న దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత గుడిపాటి వెంకట్రామయ్యను టీడీపీ వర్గీయులు గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి కిరాతకంగా చంపారు.
- 2013లో కారంపూడి మండలం నరమాలపాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత పెద వెంకటేశ్వర్లు (బ్రహ్మం)ను టీడీపీ వర్గీయులు నరికి చంపారు.
- 2017 డిసెంబర్‌లో మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గంగలకుంటకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత కంచర్ల సాంబయ్యను టీడీపీ ముఠాలు వేట కొడవళ్లతో నరికి చంపేశాయి.
- వేమూరు నియోజకవర్గం పెరవలిపాలెంలో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన ఎస్.ప్రభాకరరావుపై టీడీపీకి చెందిన సర్పంచ్ సాంబశివరావు వర్గీయులు 30 మంది దాడి చేసి కొట్టడంతో మృతి చెందాడు.
బ్రహ్మారెడ్డి విధ్వంసం..
రాజకీయంగా మనుగడ సాగించేందుకు ఫ్యాక్షన్ చరిత్ర, నేర ప్రవృత్తి కలిగిన జూలకంటి బ్రహా్మరెడ్డిని మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా చంద్రబాబు నియమించారు. ఏడుగురిని హత్య చేసిన కేసులో బ్రహా్మరెడ్డి ప్రధాన నిందితుడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో మరో నాలుగు కేసులున్నాయి. మద్యం తాగి రాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులపై కేసు నమోదు చేసినందుకు బ్రహా్మరెడ్డి తన వర్గంతో వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌పైనే దాడికి పాల్పడ్డాడు.
ముప్పాళ్లలో మూకదాడులు..
టీడీపీ అధికారంలో ఉండగా ముప్పాళ్ల ఎంపీపీ స్థానం వైఎస్సార్‌సీపీకి దక్కకుండా కిడ్నాప్‌కు పాల్పడ్డారు. ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీలతో వెళ్తున్న వైఎస్సార్ సీపీ నేతలు మహ్మద్ ముస్తఫా, అంబటి రాంబాబుపై టీడీపీ మూకలు మేడికొండూరు వద్ద దాడులకు దిగాయి. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన టీడీపీ నేతలు ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు.
మత రాజకీయాలు..
పల్నాడులో టీడీపీ హత్యా రాజకీయాలను పోలీసులు సమర్థంగా తిప్పికొడుతుండటంతో సహించలేని ఎల్లో సిండికేట్ మతాన్ని అడ్డు పెట్టుకుని దు్రష్పచారానికి తెగబడుతోంది. కారంపూడిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు బోలినేది అమర్‌నాథ్‌పై టీడీపీ నేతలు హత్యా యత్నానికి పాల్పడిన ఘటనలో ఏ–13గా ఉన్న సయ్యద్ అన్వర్ బాషాను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరచడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీన్ని వక్రీకరిస్తూ మతం రంగు పులుముతూ విద్వేషాలు రేకెత్తించేందుకు ఈనాడు బరితెగించింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో సయ్యద్ అన్వర్ బాషా ముద్దాయి కావడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచినట్లు గురజాల డీఎస్పీ ఏ.పల్లపురాజు శుక్రవారం మీడియాతో పేర్కొన్నారు. కిడ్నాప్ జరిగినట్లు కొన్ని మీడియాల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment