పెళ్లయి ఇద్దరు సంతానం ఉన్న ఓ వ్యక్తి ప్రేమ పేరుతో.. బాలికకు గర్భం | - | Sakshi
Sakshi News home page

పెళ్లయి ఇద్దరు సంతానం ఉన్న ఓ వ్యక్తి ప్రేమ పేరుతో.. బాలికకు గర్భం

Published Sun, Jun 25 2023 12:14 PM | Last Updated on Sun, Jun 25 2023 12:16 PM

నిందితుడి అరెస్ట్‌ చూపుతున్న డీఎస్పీ కేశప్ప   - Sakshi

నిందితుడి అరెస్ట్‌ చూపుతున్న డీఎస్పీ కేశప్ప

అన్నమయ్య: పదో తరగతి ఫెయిలై ఇంటి పట్టున ఉంటున్న అభం శుభం తెలియని బాలికను.. పెళ్లయి ఇద్దరు సంతానం ఉన్న ఓ వ్యక్తి ప్రేమ పేరుతో వంచించగా గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు దిశ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కటకటాల వెనక్కు పంపారు. ఈ సంఘటన బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం పంచాయతీలో జరిగింది.

శనివారం మదనపల్లె డీఎస్పీ కేశప్ప దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుమ్మసముద్రం పంచాయతీ బుచ్చిరెడ్డిగారిపల్లెకి చెందిన మైనర్‌బాలిక (15) పదో తరగతి ఫైయిలై ఇంటి వద్ద ఉంటోంది. బాలిక ఒంటరిగా ఉంటున్న సమయంలో చూసుకుని అదే గ్రామానికి చెందిన బి.ఆదినారాయణ (26) నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానని నమ్మించేవాడు. తర్వాత బాలికకు మాయమాటలు చెప్పి బలవంతంగా వశ పరుచుకున్నాడు. పలుమార్లు శారీరకంగా కలవడంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మోసం చేసిన ఆదినారాయణను నిలదీశారు.

తర్వాత దిశ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఆదినారాయణపై స్థానిక పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు వాస్తవాలు నిర్ధారించుకుని.. నిందితుడిని శనివారం స్థానిక దిగువబస్టాండ్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. కాగా ఇటీవల కాలంలో మైనర్‌ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతులు చేస్తున్న ఘటనలు మదనపల్లె సబ్‌డివిజన్‌లో జరుగుతున్నాయని డీఎస్పీ కేశప్ప చెప్పారు. ఈ విషయంలో తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలపై నిర్లక్ష్యం చేయకుండా స్థానిక పోలీసుల దృష్టికి తీసుకు రావాలని, పోలీసులు న్యాయం చేస్తారని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement