పంటలు నష్టపోయిన రైతు భూపాల్ రెడ్డి
కురబలకోట : కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లె గ్రామం దిగువశీతివారిపల్లెను ఆనుకుని ఉన్న శీతివారిపల్లె చెరువు ఆదివారం సాయంత్రం తెగిపోయింది.
హంద్రీనీవా కాలువ ద్వారా ప్రవహిస్తున్న కృష్ణా జలాల లీకేజీ నీళ్లతో ఈ చెరువు నిండింది. ఇన్నాళ్లు నిండు కుండలా ఉన్న చెరువు ఒక్కసారిగా తెగిపోవడంతో గ్రామస్తులు, ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. ఆ ఊరికి సమీపంలో ఇదివరలో ఈ చెరువు కిందగా మట్టి తీశారు. దీంతో ఈ చెరువు కట్ట దెబ్బతిని తెగిందని గ్రామస్తులు చెబుతున్నారు. తెగిన చెరువుతో ఆ గ్రామ రైతు భూపాల్ రెడ్డి ఎక్కువగా నష్టపోయారు. రెండు ఎకరాలకు పైగా ఉన్న వేరుశనగ, వరి లాంటి పంటలు మొత్తం నష్టపోవాల్సి వచ్చిందని రైతు వాపోతున్నాడు. అలాగే శంకర్రెడ్డి తదితర రైతుల పంటలు కూడా దెబ్బతిన్నాయి. తెగిన శీతివారిపల్లె చెరువు నీళ్లు దిగువన ఉన్న అప్పాలమ్మ చెరువుకు చేరుతున్నాయి. ఇదివరకే ఆ చెరువు కూడా నిండి మొరవ పోతుండడంతో దిగువన ఉన్న బయ్యమ్మ చెరువు ద్వారా కోసువారిపల్లె వైపు ప్రవహిస్తున్నాయి. అఽధికారులు అప్రమత్తం చేశారు.
చేతికి వచ్చిన పంటలు నష్టపోయిన రైతులు
Comments
Please login to add a commentAdd a comment