అనంతరాజుపేటలో 591 కల్తీ మద్యం బాటిళ్లు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

అనంతరాజుపేటలో 591 కల్తీ మద్యం బాటిళ్లు స్వాధీనం

Published Thu, Jan 30 2025 12:08 AM | Last Updated on Thu, Jan 30 2025 12:08 AM

-

రైల్వేకోడూరు అర్బన్‌ : రైల్వేకోడూరు మండల పరిధిలోని అనంతరాజుపేట పంచాయతీ, ప్రధాన హైవే వద్ద 591 కల్తీ మద్యం బాటిళ్లను సీజ్‌ చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ జోగేంద్ర ఆధ్వర్యంలో సీఐ పుల్లయ్య, నీలకంఠేశ్వర్‌ రెడ్డిలు దాడులు నిర్వహించి కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు. అనంతరాజుపేటకు చెందిన వెంకట నారాయణతోపాటు మరొకరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. రెండు ద్విచక్ర వాహనాలు సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ అక్రమ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని విక్రయిస్తే ఉపేక్షించేది లేదన్నారు.

కోట్లు విలువజేసే స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయిస్తారా?

కడప కార్పొరేషన్‌ : కడప నగరంలోని అక్కాయపల్లెలో రూ.80కోట్లు విలువ జేసే అత్యంత ఽఖరీదైన స్థలాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించడం అన్యాయని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజద్‌బాషా విమర్శించారు. బుధవారం స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్కాయపల్లెలో ఆర్‌అండ్‌బి ఈఈ కార్యాలయం, న్యాక్‌ సెంటర్‌ ఉన్న ప్రాంతంలో టీడీపీ ఆఫీసుకు 2.00 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ ఇవ్వడం దారుణమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement