ప్రజలను మోసగించడంలో సీఎం చంద్రబాబు దిట్ట
ఒంటిమిట్ట : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఒంటిమిట్టలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజల్లో ప్రభుత్వంపై ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, సంపద సృష్టించిన తరువాత ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తానని, ఇప్పుడున్న నిధులను సంక్షేమానికి వాడదలుచుకోలేదని చంద్రబాబు ప్రజలకు నేరుగా చెప్పారన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం ఇష్టంలేక, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటూ మోసపూరిత మాటలు మాట్లాడుతూ చేతకాని ముఖ్యమంత్రిగా నిలిచిపోయారని ఆయన ధ్వజమెత్తారు. సమావేశం అనంతరం వైఎస్సార్సీపీ నాయకుడు ఆకేపాటి శివారెడ్డి చిన్న కుమారుడు సంవత్సరికం కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఆకేపాటి శివారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు,
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి
Comments
Please login to add a commentAdd a comment