బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం
పీలేరు : టీడీపీ నాయకుడి దాడిలో మృతి చెందిన చిత్తూరు జిల్లా సదుం మండలం నడిగడ్డ మాదిగపల్లెకు చెందిన రమణయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రిలో ఉన్న రమణయ్య మృతదేహన్ని మాజీ మంత్రి సందర్శించి మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దాడులు హద్దుమీరిపోయాయన్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వాస్పత్రి వద్ద వివిధ దళిత సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నిందితున్ని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీటీసీ ఎ.టి.రత్నశేఖర్‌రెడ్డి, ఎంపీపీ సతీష్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment