కేజీబీవీల్లో వెట్టిచాకిరిపై చర్యలు తీసుకోవాలి
మదనపల్లె సిటీ : కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో విద్యార్థుల చేత వెట్టి చాకిరి చేయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్, గర్ల్ కన్వీనర్ భవిత మాట్లాడుతూ ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం కేజీబీవీల్లో సోషియల్ ఆడిట్లో పలు విషయలు వెలుగులోకి వచ్చాయన్నారు. కేజీబీవీలను డీఈఓ, జీసీడీఓ పర్యవేక్షించకుండా గాలికి వదిలేశారన్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయ డీటీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు నవదీప్, నవ్య, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment