నేషనల్‌ క్రెడిట్‌తో ఉన్నత విద్యా ప్రమాణాలు | - | Sakshi
Sakshi News home page

నేషనల్‌ క్రెడిట్‌తో ఉన్నత విద్యా ప్రమాణాలు

Published Thu, Jan 30 2025 12:07 AM | Last Updated on Thu, Jan 30 2025 12:07 AM

నేషనల్‌ క్రెడిట్‌తో ఉన్నత విద్యా ప్రమాణాలు

నేషనల్‌ క్రెడిట్‌తో ఉన్నత విద్యా ప్రమాణాలు

కురబలకోట : కాలానికి అనుగుణంగా జాతీయ స్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనతో ఉన్నత విద్యా సంస్థలలో నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఆవిష్కరించడం జరిగిందని హైదరాబాదు యూనివర్సిటీ యూజీసీ హ్యూమన్‌ రిసోర్సు డెవలప్‌మెంట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వై. నరసింహులు పేర్కొన్నారు. అంగళ్లులోని మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ అంశంపై బుధవారం వర్క్‌షాపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వివిధ స్థాయిల్లో మార్కుల స్థానంలో క్రెడిట్స్‌ ఇస్తారన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందన్నారు. క్రెడిట్స్‌ ఆధారంగానే విద్యార్థి స్థాయిని నిర్ధారిస్తారన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రం మార్గదర్సకాలను విడుదల చేసిందన్నారు.

యూజీసీ డైరెక్టర్‌ నరసింహులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement