ఏపీఎండీసీ పాఠశాల ఉద్యోగుల తొలగింపు అభివృద్ధా?
ఓబులవారిపల్లె : మూడేళ్లుగా ఏపీఎండీసీ పాఠశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధా అని కోడూరు అభివృద్ధి పోరాట కమిటీ కన్వీనర్ పి.జాన్ ప్రసాద్ ప్రశ్నించారు. మంగంపేట ఏపీఎండీసీ పాఠశాల ఎదురుగా నాన్ టీచింగ్ స్టాఫ్ మూడో రోజు రిలే నిరాహార దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగంపేట ఏపీఎండీసీ గనుల విస్తరణలో ఇల్లు, భూములు కోల్పోయిన కుటుంబాల వారు నాన్ టీచింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారన్నారు. వారికి రావాల్సిన మూడు నెలల జీతం అడిగినందుకు విధులనుంచి తొలగించడం దుర్మార్గమన్నారు. ఏపీఎండీసీ ఎండీ వెంటనే స్పందించి తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్, మండల కార్యదర్శి నాగిపోగు పెంచలయ్య, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు మద్దెల ప్రసాద్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల నాయకుడు కేశవులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment