లిఫ్ట్‌ రోప్‌ తెగి ఏడుగురికి తీవ్ర గాయాలు | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌ రోప్‌ తెగి ఏడుగురికి తీవ్ర గాయాలు

Published Sat, Apr 20 2024 2:00 AM

లిప్ట్‌లో కాలు విరిగిన బాధితుడు 
 - Sakshi

– ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రమాదం

రాయచోటి టౌన్‌ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో లిప్ట్‌ రోప్‌ తెగి శుక్రవారం ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కదిరివాండ్లపల్లె చెందిన ఒక వ్యక్తి అనారోగ్యంతో ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ పేషెంట్‌ను చూసేందుకు బంధువులు, మిత్రులు వచ్చారు. సుమారు పది మంది వరకు ఆస్పత్రి లిఫ్ట్‌ను ఎక్కారు. సగం దూరం వెళ్లగానే ఒకసారిగా రోప్‌ తెగిపోవడంతో లిప్ట్‌ బాక్స్‌ ఒకసారిగా కిందకు వచ్చి పడింది. అందులో ఉన్న వారిలో ఏడుగురికి కాళ్లు చేతులు విరిగాయి. ఈ భవనం రాయచోటి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడి బంధువుకు చెందినది. కొత్తగా నిర్మించిన ఈ ఆస్పత్రి భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం వలన ప్రమాదం జరిగిందని ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ప్రమాదం విషయం బయటి కి పొక్కనీయకుండా ఆస్పత్రి యాజమాన్య, టీడీ పీ నాయకులు కొందరు చాలా జాగ్రత్త వహించా రు. అదే ఆస్పత్రిలో క్షతగాత్రులకు తగు చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలించారు. నష్టపరిహారం చెల్లించడంతో పాటు వైద్య ఖర్చులు కూడా భరిస్తారని నచ్చచెప్పారు. దీనిపై పోలీసులను వివరణ అడుగగా తమ వద్ద కు ఫిర్యాదు చేయడానికి ఎవరూ రాలేదన్నారు.

తీవ్రంగా గాయపడిన మహిళను 
ఆటో ఎక్కిస్తున్న బంధువులు
1/2

తీవ్రంగా గాయపడిన మహిళను ఆటో ఎక్కిస్తున్న బంధువులు

తీవ్రంగా గాయపడిన మహిళ
2/2

తీవ్రంగా గాయపడిన మహిళ

Advertisement
 
Advertisement
 
Advertisement