సిద్దవటంలో కుష్టు వ్యాధిపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

సిద్దవటంలో కుష్టు వ్యాధిపై అవగాహన

Published Fri, Jan 31 2025 1:11 AM | Last Updated on Fri, Jan 31 2025 1:11 AM

సిద్దవటంలో కుష్టు వ్యాధిపై అవగాహన

సిద్దవటంలో కుష్టు వ్యాధిపై అవగాహన

సిద్దవటం : మండల కేంద్రమైన సిద్దవటంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం కుష్టు వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ నాగరాజు మాట్లాడుతూ జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం జరుగుతుందన్నారు. చర్మంపై స్పర్శలేని మచ్చలు, చెవులపై, వీపుపై, ఎదపై, నొప్పిలేని బొడిపెలు, కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం వంటి లక్షణాలు ఉన్నవారు స్థానిక వైద్య శాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లెప్రసీ అధికారి రవిబాబు, పి. కొత్తపల్లె పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ రంగలక్ష్మీ, పాఠశాల హెచ్‌ఎం శ్రీరాములు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement