పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దాం | - | Sakshi
Sakshi News home page

పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దాం

Published Fri, Jan 31 2025 1:12 AM | Last Updated on Fri, Jan 31 2025 1:12 AM

పార్ట

పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దాం

ఆకలి తీరిస్తే.. పదింతలు మేలు

రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న సీఎం చంద్రబాబు

సాక్షి రాయచోటి : సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని పీడీఆర్‌ కన్వెక్షన్‌ హాలులో వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పదవులు పొందిన వారితో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జగన్‌ హయాంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను క్యాలెండర్‌ ప్రకారం కొనసాగించి చరిత్ర సృష్టించారన్నారు. దేశంలోనే జగన్‌ ఒక్కరే విపత్కర సమయంలో ఆదుకున్న నాయకుడని కొనియాడారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వాటిని గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.ఏడు నెలల పాలనలోనే రూ 1.19 లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పెన్షన్లును తొలగించారన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ హామీలను అమలు చేయలేనంటున్న బాబు ప్రజలపై 16 వేల కోట్ల విద్యుత్‌ చార్జీల భారాన్ని మోపడం శోచనీయమన్నారు. పార్టీ శ్రేణులు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. జగన్‌ సీఎం అయితే మా దెబ్బ ఏంటో రుచి చూపిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి,, ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, అధికార ప్రతినిధులు ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి, కొరముట్ల, శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, మదనపల్లె ఇన్‌ఛార్జి నిసార్‌ అహ్మద్‌, నల్లారి తిమ్మారెడ్డి పాల్గొన్నారు.

సాక్షి రాయచోటి : వైఎస్సార్‌ సీపీలో కార్యకర్తలకు సంబంధించి ఇంతకుముందు ఒక లెక్క. ఇక నుంచి మరో లెక్క..కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు పార్టీ కోసం ఇబ్బంది పడిన ప్రతి కార్యకర్తను మాజీసీఎం వైఎస్‌ జగన్‌ గుండెల్లో పెట్టుకుంటారు..అధికారంలోకి రాగానే మొదట కార్యకర్తల బాగోగులకే పెద్దపీట వేస్తాం.పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడమే లక్ష్యంగా ఇప్పటి నుంచి కష్టపడి పనిచేయండి అని అన్నారు. అధికార పార్టీపై ఎనిమిది నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, భవిష్యత్తు మనదేనని. కలిసి కట్టుగా ముందుకు కదులుతూ జగన్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు పార్టీతోపాటు అధినేత అండగా ఉంటారని తెలిపారు. గురువారం సాయంత్రం రాయచోటి పట్టణంలోని పీలేరు సర్కిల్‌ సమీపంలోఉన్న పీడీఆర్‌ కన్వెన్షన్‌ హాలులో వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో నూతనంగా నియమితులైన నూతన జిల్లా కార్యవర్గం 42 మంది,అనుబంధ విభాగాల అధ్యక్షులు 22 మందితో రాయచోటి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు, అనుబంధ విభాగాల ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడూ వచ్చి వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యమని అన్నారు.క్లాస్‌ కాదు..మాస్‌ కాదు....ఆంధ్ర ప్రజలందరూ జగన్‌ను కోరుకుంటున్నారన్నారు. ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ మాట్లాడుతూ 2029లో జగనే సీఎం అని అన్నారు. బీసీ, ఎస్సీ ఎస్టీలు బాగుండాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

– శ్రీకాంత్‌ రెడ్డి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పేదల ఇళ్లను అక్రమంగా కూల్చుతోందని, అక్రమ కేసులు పెడుతున్నారు. ఎన్ని కష్టాలు పెట్టినా అందరం కలిసికట్టుగా ముందుకే అడుగు వేయాలి. గతంలో జగన్‌ ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలి. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను విస్మరించారు. పార్టీ నూతన కమిటీలు చురుగ్గా పనిచేయాలి. అధికార పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి.

సైనికులుగా పని చేద్దాం

– ఆకేపాటి అమరనాథరెడ్డి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలతోపాటు అనుబంధ విభాగాల ప్రతినిధులు సైనికుల్లా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. కూటమి సర్కార్‌ నియంతృత్వ పోకడలను ధైర్యంగా ఎదుర్కొందాం. జగన్‌ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలవుతున్నా ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేయలేక ప్రజలను మోసగించింది. ఇటీవల చంద్రబాబు తీరును మాజీ ఎంపీ హర్షకుమార్‌ కూడా విమర్శించారు. అదే సమయంలో వైఎస్‌ జగన్‌ను పొగడని హర్షకుమార్‌ మంచి సీఎం అంటూ కితాబిచ్చారు. రానున్న రోజుల్లో ఎలాంటి ఎన్నికలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. జగన్‌ను మరోసారి సీఎం గా చేసుకుంటే రాష్ట్రం మరింత అభివద్ధి చెందుతుంది.

డైవర్షన్‌ పాలిటిక్స్‌ చంద్రబాబుకే చెల్లు:

– ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మైలేజ్‌ వస్తున్న ప్రతిసారీ చంద్రబాబుకు డైవర్షన్‌ రాజకీయాలు చేయడం అలవాటు.ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తే ఎనిమిది నెలల కాలానికే ఎంతో చెడ్డ పేరు వచ్చింది. ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయక ప్రజలను మభ్యపెడుతున్నారు. వచ్చిన నిధులన్నీ అమరావతి, పోలవరంకే ఖర్చుచేస్తూ ఈ ప్రాంత అభివద్దిని విస్మరించారు. అభివద్దికి కేరాఫ్‌ వైఎస్సార్‌సీపీ. పార్టీ క్యాడర్‌ కసిగా పనిచేయాలి.

కూటమి ప్రభుత్వ పాలన అట్టర్‌ ఫ్లాప్‌:

– కొరముట్ల శ్రీనివాసులు

జగన్‌ ప్రభుత్వ ఐదేళ్ల పాలనను, ఎనిమిది నెలల చంద్రబాబు పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటూ ఎ వరిని కదిపినా బాధపడుతున్నారు. కూటమి ప్రభుత్వ పాలన అట్టర్‌ ఫ్లాప్‌. ప్రభుత్వ వైఫల్యాలను సోషియల్‌ మీడియా,మీడియాల ద్వారా పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలి. జగన్‌ కష్టపడిన ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటారు. పార్టీ కోసం అందరం కదం తొక్కుదాం.కూటమి ప్రభుత్వ ఆగడాలపై పోరాడుదాం.

వైఎస్సార్‌సీపీకి మంచిరోజులు వస్తాయి

– నిస్సార్‌ అహమ్మద్‌

రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ మంచిరోజులు వస్తాయి. గతంలో ఇచ్చిన హామీలను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లాగా పవిత్రంగా భావించి వైఎస్‌ జగన్‌ అమలు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించింది. రాజ్యాంగంలో హామీలు అమలు చేయకపోతే కాల్‌బ్యాక్‌ ఆప్షన్‌ పెట్టాలి. అప్పుడు ఇలాంటి కూటమి సర్కార్‌లకు బుద్ధి వస్తుంది. రానున్నకాలంలో కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుంది.

తల్లిదండ్రులు లేని పిల్లలను

అక్కున చేర్చుకున్న కలెక్టర్‌

అధికార పార్టీకి ప్రజల్లో

పూర్తి స్థాయిలో వ్యతిరేకత

కష్టపడి పనిచేయండి...భవిష్యత్తు మనదే

వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దాం 1
1/1

పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement