No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, Jan 31 2025 1:12 AM | Last Updated on Fri, Jan 31 2025 1:13 AM

No He

No Headline

మదనపల్లె సిటి : శత శాతం ఫలితాలే లక్ష్యంగా పాఠశాలల విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. జిల్లాలో 21,468 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. డిసెంబర్‌ 2వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ తరగతులు కొనసాగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వం అల్పాహారం అందించకపోవడంతో విద్యార్థులు ఖాళీ కడుపులతో చదువుతున్నారు. ఆకలితో చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంది.

తొమ్మిది గంటలు పాఠశాలల్లోనే...!

ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా పేద,మధ్యతరగతి విద్యార్థులు చదువుతున్నారు. పేదరికం, ఇంట్లో తల్లిదండ్రులు ఉదయమే కూలీ పనులకు వెళ్లడం తదితర కారణాలతో ఏమి తినకుండానే పా ఠ శాలలకు వస్తున్నారు. అసలే పోషకాహార లోపాలతో బాధపడుతున్న వారు సరైన సమయానికి అల్పాహారం అందక నీరసపడిపోతున్నారు. పల్లెల్లో ఉదయం ఎనిమిది గంటలకే పాఠశాలలకు చేరుతున్న పదో తరగతి విద్యార్థులు ప్రత్యేక తరగతుల కారణంగా సాయంత్రం 5.30 వరకు ఉండాల్సి వస్తోంది.

గతంలో ఇచ్చారు....

గతంలో మున్సిపాలిటీల్లో ఉన్నతపాఠశాలల్లో మున్సిపల్‌శాఖ పదోతరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్‌ అందించారు. దీంతో వారికి ఊరట కలిగేది. తరువాత దీనిని పూర్తిగా విస్మరించారు.

కొన్ని చోట్ల దాతల సాయం

దాతలు, స్థానికులు, ఉపాద్యాయులు స్పందిస్తున్నారు. మదనపల్లె పట్టణం వివేకానంద మున్సిపల్‌ ఉన్నత పాఠశాల(మాయాబజార్‌)లో దాతలు, ఉపాధ్యాయులు సహకారంతో డిసెంబర్‌ మొదటి వారం నుంచి సాయంత్రం టిఫిన్‌,స్నాక్స్‌ అందిస్తున్నారు. హెచ్‌ఎం పురం వెంకటరమణ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతో విద్యార్థులు ఉత్సాహంగా ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు.

అదనపు తరగతుల్లో

అందని అల్పాహారం

దాతలు స్పందిస్తారని

విద్యార్థుల ఎదురుచూపులు

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline1
1/1

No Headline

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement