No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, Jan 31 2025 1:13 AM | Last Updated on Fri, Jan 31 2025 1:13 AM

No Headline

No Headline

రాయచోటి అర్బన్‌ : తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నలుగురు పిల్లలను అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి అక్కున చేర్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎకనామిక్స్‌లెక్చరర్‌గా పనిచేస్తున్న వి.వెంకటరమణ గుండెపోటుతో ఈ నెల 16వ తేదీన మరణించారు. ఇతని సొంత ఊరు రాయచోటి మండలం ఏపిలవంకపల్లి అరి హరిజనవాడ కాగా 2021లో కరోనా సమయంలో అతని భార్య రాజేశ్వరమ్మ కూడా చనిపోవడంతో వారి నలుగురు పిల్లలు అనాధలయ్యారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న వారిని తీసుకుని ఉమ్మడి కడప జిల్లా కాంట్రాక్ట్‌ జూనియర్‌ లెక్చరర్‌ జేఏసీ చైర్మన్‌ జానీబాబు, కో చైర్మన్‌ హరిప్రసాద్‌రెడ్డి, సభ్యుడు శ్రీధర్‌లు రాయచోటి కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరిని కలిసి వారి కుటుంబ పరిస్థితులు వివరించారు. దివంగత వెంకటరమణ నలుగురి సంతానంలో కుమారులు శ్రీనివాస్‌ ఫార్మసీ డిస్కంటిన్యూ, హర్షవర్ధన్‌ 5వ తరగతి, కుమార్తెలు లక్ష్మీ డిగ్రీ మొదటి సంవత్సరం, లాస్య 5వ తరగతి, చదువుతున్నారు. పిల్లల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తయారైన పరిస్థితుల్లో కలెక్టర్‌ను కలవడంతో స్పందించిన ఆయన ఒక్కొక్కరికి రూ.4 వేల వంతున ముగ్గురు పిల్లలకు నెలకు రూ.12 వేల పింఛన్‌ మంజూరు చేశారు. ఆది ఆ పిల్లలకు 18 సంవత్సరాలు నిండే వరకు ప్రతి నెలా వస్తుంది. దీంతోపాటు తక్షణ సాయంగా లక్ష రూపాయలను మంజూరు చేశారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కూడా ఆర్థికసాయం వచ్చేలా చేస్తానని ఆ పిల్లలకు అండగా ఉంటానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. బుధవారం రాయచోటిలో కలెక్టరేటలో డీఆర్‌ఓ మధుసూదన్‌ చేతుల మీదుగా డీఐఈఓ కృష్ణయ్య, ప్రిన్సిపల్‌ అమరేంద్ర, జిల్లా జేఏసీ కో ఛైర్మన్‌ హరిప్రసాద్‌రెడ్డి సమక్షంలో లక్ష రూపాయల చెక్కును పిల్లలకు అందజేశారు. అనంతరం కలెక్టర్‌ పిల్లలతో మాట్లాడుతూ బాగా చదువుకొంటే తన వంతు సహకరిస్తానన్నారు. కలెక్టర్‌ ఆ పిల్లల పట్ల తీసుకున్న శ్రద్ధకు జేఏసీ కో చైర్మన్‌ హరిప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement