బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
రాయచోటి : అన్నమయ్య జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమశాఖ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి సూర్యకుమారి ఐసీడీఎస్ అధికారులను, సూపర్ వైజర్లను ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఛామకూరి శ్రీధర్తో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ అంగన్ వాడీ సేవలను పటిష్టవంతంగా నిర్వహించాలన్నారు. కిషోర వికాసం కార్యక్రమానికి సంబంధించి అంగన్ వాడీ, పాఠశాలలు, కళాశాలలో సఖి, యువ గ్రూపులను ఏర్పాటు చేసి వారంలో ఒకరోజు గ్రూపులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బాల్య వివాహాలను కట్టడి చేసేందుకు జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ప్రత్యేకాధికారికి వివరించారు.జిల్లాకు మొదటిసారిగా వచ్చిన జిల్లా ప్రత్యేక అధికారి సూర్యకుమారికి జిల్లా కలెక్టర్ స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. మదనపల్లె, రాజంపేట సబ్ కలెక్టర్లు మేఘస్వరూప్, వైఖోమ్ నదియా దేవీ, ఐసీడీఎస్ కర్నూలు రీజనల్ జాయింట్ డైరెక్టర్, జిల్లా ఐసీడీఎస్ అధికారిణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment