Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు | Sakshi
Sakshi News home page

Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు

Published Sat, May 4 2024 6:49 AM

Daily Horoscope: Rasi Phalalu On 04-05-2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.ఏకాదశి సా.5.58 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పూర్వాభాద్ర రా.7.51 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: ఉ.8.44 నుండి 10.13 వరకు, తిరిగి రా.1.54 నుండి 3.23 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.36 నుండి 7.13 వరకు, అమృతఘడియలు: ప.12.27 నుండి 1.56 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.37, సూర్యాస్తమయం: 6.16. 

మేషం: ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. దైవదర్శనాలు.  మిత్రులతో విభేదిస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

వృషభం: ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. కుటుంబసమస్యలు తీరతాయి. ఆస్తుల కొనుగోలలో ఆటంకాలు తొలగుతాయి. విందువినోదాలు.

మిధునం: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.వృత్తి,వ్యాపారాలలో ఆశించిన ప్రగతి ఉంటుంది. ఆలయ దర్శనాలు. కళాకారుల యత్నాలు సఫలం.

కర్కాటకం: అనుకోని ధనవ్యయం. పనుల్లో తొందరపాటు. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులు కొంత శ్రమపడాలి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  ఊహించని మార్పులు.

సింహం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు.బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు సామాన్యమే. కళాకారులకు చికాకులు..

కన్య: పనులు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.నూతన ఉద్యోగయోగం. ఆలయ  దర్శనాలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలత.

తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు.వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన.

వృశ్చికం: రుణఒత్తిడులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. అనారోగ్యం.

ధనుస్సు: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు.  ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగులకు ఒత్తిడులు. దైవచింతన..

మకరం: కొత్త పనులు ప్రారంభిస్తారు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ధనలబ్ధి. ప్రముఖుల పరిచయం. కళాకారులకు మంచి గుర్తింపు.

కుంభం: అనుకోని ధనవ్యయం. అదనపు బాధ్యతలు. వృత్తి, వ్యాపారాలు కొంత  నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. నిరుద్యోగుల ప్రయత్నాలు ముంందుకు సాగవు. దూరప్రయాణాలు.

మీనం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. సోదరులతోసఖ్యత. నూతన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
 

Advertisement
Advertisement