హోరాహోరీగా ఎద్దుల బల ప్రదర్శన
రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి 175 వజ్రోత్సవ తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బలప్రదర్శన హోరాహోరీగా సాగింది. రెండు పండ్ల సైజ్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనలో సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నల్లబోతు ప్రవీణ్ కుమార్, ప్రవళ్లిక, బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన బోయిన నాగరాజు కంబైన్డ్ గిత్తలు 3,600 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిగా రూ.30వేలు పొందాయి. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన జువ్వాజి మేఘనాథ్నాయుడు గిత్తలు 3,359.30 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి రూ.25వేలు దక్కించుకున్నా యి. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడుకు చెందిన ఎం.నవీన్‌కుమార్, పల్నాడు జిల్లా ఈపూరు మండలం అంగలూరుకు చెందిన ఆర్.హరిబాబు కంబైన్డ్ గిత్తలు 3,300 అడుగుల దూరం లాగి 3వ బహు మతి రూ.20 వేలు కై వసం చేసుకున్నాయి. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకివీడు గ్రామానికి చెందిన బి.విజయలక్ష్మినాయుడు గిత్తలు 3,251 అడు గుల దూరం లాగి 4వ బహుమతి రూ.16 వేలు దక్కించుకున్నాయి. నంద్యాల జిల్లా గడివేముల మండలం గడిగరేవులకు చెందిన పి.సంజయ్‌కుమార్ గిత్తలు 3,221.6 అడుగుల దూరం లాగి 5వ బహుమతి రూ.13 వేలు గెలుచుకున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అక్కల రెడ్డిపల్లెకు చెందిన ఎం.నాగార్జున గిత్తలు 3,163 అడుగులు లాగి 6వ బహుమతి రూ.12 వేలను పొందాయి. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామానికి చెందిన సీహెచ్ హేమంత్సాయికుమార్, పల్నాడు జిల్లా క్రోసూరు మండలం 88 తాళ్లూరుకు చెందిన ఎం.ప్రవీణ్‌కుమార్ కంబైన్డ్ గిత్తలు 2,876.7 అడుగులతో 7వ బహుమతి రూ.11వేలు కై వసం చేసుకున్నాయి. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బసినపల్లె గ్రామానికి చెందిన వై.వెంకట చైతన్యకుమార్ గిత్తలు 2,688.1 అడుగులు లాగి 8 వబహుమతి రూ.10 వేలు దక్కించుకున్నాయి. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకివీడు గ్రామానికి చెందిన బి.విజయలక్ష్మినాయుడు గిత్తలు 2,681.6 అడుగులు లాగి 9వ బహుమతి రూ.9వేలు గెలుచుకున్నాయి. బలప్రదర్శనలో మొత్తం 15 జతలు పాల్గొన్నాయి. మిగిలిన 6 జతలకు కూడా రూ.3 వేలు చొప్పున అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment