బైపాస్‌ రోడ్డు పనులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బైపాస్‌ రోడ్డు పనులు ప్రారంభం

Published Wed, Jan 29 2025 1:30 AM | Last Updated on Wed, Jan 29 2025 1:30 AM

-

తొలి రోజు 9 కిలోమీటర్ల

మేర మార్కింగ్‌ పూర్తి

నేడు పూర్తి కానున్న ప్రక్రియ

నరసరావుపేట రూరల్‌: బైపాస్‌ రోడ్డు పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. చీరాల వాడరేవు–నకరికల్లు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చేపడుతున్న నరసరావుపేట బైపాస్‌ రోడ్డు పనులు మంగళవారం ప్రారంభించారు. మండలంలోని రావిపాడు, గుంటగార్లపాడు, ఇస్సప్పాలెం, జొన్నలగడ్డ, కేసానుపల్లి గ్రామాల పరిధిలో 17 కిలోమీటర్ల మేర బైపాస్‌ రోడ్డును నిర్మించాల్సి ఉంది. ఆయా గ్రామాల పరిధిలోని భూములు కోల్పోతున్న రైతులు దీనిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. విలువైన భూములు బైపాస్‌రోడ్డుకు ఇచ్చేందుకు రైతులు అంగీకరించకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారులు పలు మార్లు వారితో సమావేశాలు నిర్వహించారు. అధికారుల ప్రతిపాదనలకు రైతులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు మధ్య బైపాస్‌ రోడ్డు సర్వేను ప్రారంభించారు.

తొలిరోజు 60 శాతం పూర్తి

రావిపాడు –శాంతినగర్‌ మధ్య ప్రాంతం నుంచి సర్వేను ప్రారంభించారు. తహసీల్దార్‌ వేణుగోపాలరావు, హైవే అథారిటీ అధికారుల పర్యవేక్షణలో సర్వే జరిగింది. శాటిలైట్‌ ఆధారంగా మార్కింగ్‌ ఇచ్చే పనిని చేపట్టారు. పంట భూముల్లో బైపాస్‌ రోడ్డును నిర్మించే 45 మీటర్ల మేర మార్కింగ్‌ చేశారు. మూడు బృందాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. మొదటి రోజు జొన్నలగడ్డ బైపాస్‌ వరకు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 17 కిలోమీటర్లలో తొలిరోజు 9 కిలోమీటర్ల మేర మార్కింగ్‌ పూర్తి చేశారు. శాటిలైట్‌ లింక్‌ అందని కారణంగా రావిపాడు పరిధిలో ఒక కిలోమీటరు, గుంటగార్లపాడులో కొంత మేరకు మార్కింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. బుధవారం కేసానుపల్లి పరిధిలోని ఐదు కిలోమీటర్లతోపాటు రావిపాడు, గుంటగార్లపాడులో మిగిలిపోయిన మార్కింగ్‌ను పూర్తిచేయనున్నారు. రైతుల నుంచి వ్యతిరేకత కారణంగా భారీ పోలీసు బందోబస్తును సర్వే పనులకు ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement