చంద్రబాబుకు అలవాటే
ఎన్నికలకు ముందు బూటకపు హామీలివ్వటం, గెలుపొందాక మాటమార్చటం చంద్రబాబుకు అలవాటే. అధికారం కోసం ఎన్నికల ముందు అమలు చేయలేని హామీలిచ్చారు. తీరా గెలిచాక పథకాల అమలుకు రాష్ట్ర బడ్జెట్ లేదంటూ చేతులెత్తేయటం చంద్రబాబు నైజం.
డాక్టర్ ఈవూరు గణేష్,
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, రేపల్లె
అబద్దపు హామీలతో అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు లోటు సాకుతో ప్రజలకు ఇవ్వా ల్చిన పథకాలను ఇవ్వకుండా కుంటి సాకులతో కాలయాపన చేయాలనుకుంటే ప్రజలు క్షమించరు. తక్షణం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను అమలు చేయాలి.
వరికూటి అశోక్బాబు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, వేమూరు
చంద్రబాబు ప్రజలను మరోసారి మోసం చేశా డు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చాడు. తీరా గెలిచిన తర్వాత పథకాల అమలుకు డబ్బు లేదని నిస్సిగ్గుగా చెబుతున్నా డు. ఆర్థిక పరిస్థితి బాగా లేదు. పథకాల అమలుకు పదేళ్లు పడుతుందని చెప్పడం విడ్డూరం.
పానెం చిన హనిమిరెడ్డి, వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త
Comments
Please login to add a commentAdd a comment