
విద్యుత్ షాక్‌తో ఇద్దరు లైన్‌మెన్ల మృతి
కొల్లూరు: విద్యుత్ లైన్‌లకు మరమ్మతులు చేస్తున్న సిబ్బందికి షాక్ కొట్టి ఇద్దరు లైన్‌మెన్ మృతిచెందారు. మరో నలుగురు ఉద్యోగులు గాయపడ్డారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈపూరులంక సబ్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా అయ్యే 32 కేవీ లైన్‌పై తాటిచెట్టు పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొల్లూరు విద్యుత్ శాఖ ఏఈ కె.సుధాకర్‌బాబు శుక్రవారం ఉదయం కరెంటు సరఫరాను నిలుపుదల చేయించి ఆరుగురు సిబ్బందితో కలిసి లైన్‌లకు మరమ్మతు పనులు చేపట్టారు. వారు మరమ్మతులు చేస్తుండగానే ఆకస్మికంగా ఒక లైన్‌కు విద్యుత్ సరఫరా కావడంతో ఆరుగురు ఉద్యోగులు విద్యుదాఘాతానికి గురయ్యారు. దోనేపూడి గ్రామ లైన్‌మన్ పోతార్లంక లీలాదుర్గా శంకర్ (51), ఈపూరు సచివాలయం జూనియర్ లైన్‌మన్ ఆకుల మహేష్ (37) విద్యుత్ షాక్‌తో స్తంభం పై నుంచి కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన శంకర్‌ను స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లే సమయానికి మృతిచెందాడు. మహేష్‌ను కొల్లూరు పీహెచ్‌సీకి తరలిస్తుండగా మరణించాడు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు మునిపల్లి శ్రీను, రామకృష్ణ, మల్లిఖార్జున, నాగేశ్వరరావు కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యారు.
మరో నలుగురు ఉద్యోగులకు గాయాలు
బాపట్ల జిల్లా ఈపూరులంకలో ఘటన

విద్యుత్ షాక్‌తో ఇద్దరు లైన్‌మెన్ల మృతి

విద్యుత్ షాక్‌తో ఇద్దరు లైన్‌మెన్ల మృతి

విద్యుత్ షాక్‌తో ఇద్దరు లైన్‌మెన్ల మృతి