హైలెస్సా..హైలెస్సాకు విరామం | - | Sakshi
Sakshi News home page

హైలెస్సా..హైలెస్సాకు విరామం

Published Sat, Apr 12 2025 2:58 AM | Last Updated on Sat, Apr 12 2025 2:58 AM

హైలెస

హైలెస్సా..హైలెస్సాకు విరామం

చీరాల: సముద్ర తీర ప్రాంతాల్లో నిత్యం వినిపించే హైలెస్సా... హైలెస్సా... అనే మాటలు... మత్స్యకారుల సందడి... సముద్రంలో బోట్లు ఇకపై కనిపించవు. సముద్రం బోసిగా దర్శనమివ్వబోతోంది. ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి రెండు నెలల పాటు వేటపై నిషేధాజ్ఞలు జారీ చేయడమే అందుకు కారణం. వేట తప్ప మరో పని తెలియని మత్స్యకారులకు ఈ రెండు నెలలు కష్ట కాలమే. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో వేట నిషేధ కాలంలో ఒక్కొక్క మత్స్యకారునికి నెలకు రూ.10 వేలు ఇచ్చి ఆదుకుంది. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తర్వాత వేట నిషేధ సాయం నిలిపివేసింది. గతేడాది ఇవ్వాల్సిన మత్య్సకార వేట నిషేధ సాయం నేటికీ అందించలేదు. గంగపుత్రులపై చంద్రబాబు కపటప్రేమ ఒలకబోస్తున్నారని మత్య్సకారులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే తీరంలో వారంరోజుల పాటు వేట చేసినా మత్య్ససంపద సరిగ్గా దొరక్కపోవడంతో నానా కష్టాలు అనునభవిస్తున్నారు. మత్య్సకారులకు ఈ వేట నిషేధం పెద్ద సమస్యను తలపిస్తుంది.

జిల్లాలోని చీరాల, పర్చూరు, బాపట్ల, రేపల్లె, అద్దంకి, వేమూరు నియోజకవర్గాల్లో మత్స్యకార జనాభా 53,000 మంది ఉన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే వారు 16,500 మంది. అధికారులు ఇప్పటివరకు సర్వే చేసిన సమాచారం మేరకు ఈ ఏడాది 12,350 మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. వేట నిషేధ సమయంలో 18 వేలకు పైగానే మత్స్యకారులు ఇంటి వద్ద ఉంటూ వలలకు మరమ్మతులు చేసుకుంటుంటారు.

15 నుంచి అమలు

ఈనెల 15 నుంచి జూన్‌ 15 తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిలుపుదల చేస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. ప్రతి ఏటా ఈ సమయంలో సముద్రంలో చేపలు పునరుత్పత్తి జరుగుతుంది. దీంతో సముద్రంలో పూర్తిగా వేటను నిలుపుదల చేస్తుంటారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 2019 నుంచి 2023 జూన్‌ వరకు వేట నిషేధ సాయం ఒక్కొక్క మత్య్సకారుడికి రూ.10వేలు సాయం అందించారు. 2024 జూన్‌లో ఇవ్వాల్సిన నిషేధ సాయం నేటికి ఇవ్వకపోవడంతో మత్య్సకారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత వేట నిషేధంలో చంద్రబాబు సర్కారు కనికరించిద్దో....లేదో వేచి చూడాలి మరీ. ఒక్కొక్క మత్య్సకారుడికి రూ.20,000 ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మళ్లీ రీసర్వే అంటూ మెలిక పెట్టింది. మత్స్యకారులు వేటకు వెళ్లని సమయాల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వేట నిషేధంలో మత్య్సకారులకు వేట నిషేధం సాయం ఇవ్వలేదు. వేట తప్ప మరే ఇతర పనులు తెలియని మత్య్సకారులు ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం ఇచ్చే నిషేద సాయం జీవనభృతి త్వరగా అందించాలని మత్య్సకారులు వేడుకుంటున్నారు.

రెండున్నర నెలల పాటు సముద్రంలో వేట నిషేధం నెలకు రూ.10వేలు ఇచ్చి ఆదుకున్న జగన్‌ సాయంపై నోరు మెదపని చంద్రబాబు ఆందోళనలో మత్స్యకారులు

జీవనభృతిని త్వరగా అందించాలి

మత్య్సకారులకు గతసంవత్సరం వేట నిషేధంలో అందించని జీవన భృతి ఏడాదికి రూ.20,000 పాలకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి రెండేళ్లకు కలిపి ఒక్కో మత్య్సకారుడికి రూ.40 వేలు ఇస్తేనే మేము బతకగలం. ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబునాయుడు మత్య్సకార సాయం త్వరగా అందించి మత్య్సకారులను ఆదుకోవాలి. అలానే మత్య్సకారులకు రావాల్సిన ఇతర పధకాలకు నిధులు మంజూరు చేయాలి. కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలి.

–ఎస్‌.నూకాలు, వాడరేవు

కుటుంబ పోషణ కష్టంగా

సాధారణంగా వాడరేవు మత్స్యకారులు కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా రామయ్యపట్నం వరకు వేటకు వెళ్లి గురకా, పాములు, బొంత, కూనాము, వంజరం, పండుగప్పలు లాంటి చేపలను పట్టుకొస్తుంటారు. కానీ నేడు సముద్రంలో వేట ప్రస్తుతం ఆశాజనకంగా లేకపోవడం వలన మత్స్యకారులు తమ బోట్లను చిన్న జెట్టీ వద్ద, వలలను తీరం ఒడ్డున నిలుపుదల చేస్తున్నారు. వేటలేక నిషేద సమయం ఆసన్నమవ్వడంతో మత్య్సకారులు కుటుంబ పోషణ కోసం అవస్ధలు పడుతున్నారు. మత్య్సకారుల అభివృద్దికి ప్రభుత్వం చేయాతనందిస్తున్నామని పాలకులు మాటల్లో చెబుతున్నారే తప్ప చేతల్లో చూపించడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైలెస్సా..హైలెస్సాకు విరామం 1
1/1

హైలెస్సా..హైలెస్సాకు విరామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement